![]() |
![]() |

బుల్లితెర మీద సీరియల్స్ చాలా వస్తుంటాయి, వెళ్తుంటాయి. అలాంటి సీరియల్స్ కి ఎంతో మంది ఫాన్స్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ హీరోస్ ని హీరోయిన్స్ ని కలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ కలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఆడియన్స్ కి దగ్గరగా వెళ్లడం కోసం సీరియల్స్ టీమ్స్ ఫాన్స్ మీట్ పెడుతూ ఉంటారు. గతంలో ఎన్నో సీరియల్స్ ఇలాంటి కార్యక్రమాలు చేశాయి. ఇక ఇప్పుడు మేఘసందేశం సీరియల్ టీమ్ ఈ ఫ్యాన్ మీట్ ని వరంగల్ లో కండక్ట్ చేసింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
ఇందులో గగన్ - భూమికి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. గగన్ హైట్ కి కూడా చాలామంది అమ్మాయిలు ఫాన్స్ గా ఉన్నారు. ఇక గగన్ స్టేజి మీదకి రాగానే ఒక అమ్మాయి వచ్చి తన అభిప్రాయం చెప్పింది. ఇక ఈ ఈవెంట్ కి హోస్ట్ గా రవి వ్యవహరించాడు. "వరంగల్ లో నీ డై హార్ట్ ఫాన్స్ ఉన్నారు " అని చెప్పాడు రవి. "నేను ప్రోమోలో తన హైట్ , తన పర్సనాలిటీ చూసి ఎవరా ఇతను అనుకున్నాను అని చెప్పింది. ఆ తర్వాత అతనితో కలిసి స్టెప్ కూడా వేసింది.
ఆ తర్వాత ఒక పెద్దావిడ స్టేజి మీదకు వచ్చింది. "మీరు పాత కాలంలో ఎన్టీఆర్ లెక్కనే ఉన్నారు " అని ఆమె చెప్పేసరికి గగన్ ఫుల్ ఖుషీ ఐపోయాడు. అలాగే అక్కడికి దూరంగా కూర్చుని ఉన్న భూమి ఐతే గట్టిగా అరిచింది. ఆ తర్వాత ఆ పెద్దావిడని ఆయన హగ్ చేసుకున్నారు. అలాగే ఆమె కూడా ఒక సాంగ్ పాడారు. "నా మది నిన్ను పిలిచింది గానమై" అనే సాంగ్ ని కూడా పడేసరికి గగన్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. బోనాల జాతర సందర్భంగా ఈ ఫ్యాన్ మీట్ పేరుతో ఈ సీరియల్ టీమ్ అంతా వరంగల్ లో ఈవెంట్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది. ఇక నెటిజన్స్ ఐతే గగన్ - భూమి జోడి సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |